తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా... గణతంత్ర దినోత్సవ వేడుకలు - naagar kurnool collector in republic day celebrations

నాగర్ ​కర్నూల్ జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో కలెక్టర్ శర్మన్ చౌహన్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

the-72nd-republic-day-celebrations-were-held-at-the-nagar-kurnool-district-headquarters
ఘనంగా.. గణతంత్ర దినోత్సవ వేడుకలు

By

Published : Jan 26, 2021, 11:36 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో.. కలెక్టర్ శర్మన్ చౌహన్ పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా...

ఈ వేడుకలలో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్... పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కవాతు తిలకించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని... స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా తమ విధులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు... జిల్లా అభివృద్ధి గురించి కలెక్టర్ శర్మన్ ప్రసంగించారు.

ఇదీ చదవండి:లైవ్​​:టిక్రీ సరిహద్దు నుంచి దిల్లీలోకి ట్రాక్టర్లు

ABOUT THE AUTHOR

...view details