తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు అండగా నిలవాలి: తల్లోజు ఆచారి - బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి

లాక్​డౌన్ కారణంగా పట్టణాల్లో, గ్రామాల్లోని పేదలు ఇబ్బందులు పడకుండా భాజపా ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించాలని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు.

Thalloju Achari is a member of the National BC Commission who distributed essential commodities to the poor
పేదలకు అండగా నిలవాలి: తల్లోజు ఆచారి

By

Published : May 2, 2020, 8:12 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా మాదారం గ్రామంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భాజపా నాయకులు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. లాక్​డౌన్​ను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే ఉండాలని తెలిపారు. పేదలకు ఇబ్బందులు కలగకుండా భాజపా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు అధిక సంఖ్యలో ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details