కూతురి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. ఓ విశ్రాంత ఉద్యోగి హత్య కేసులో నిందితుడిగా చిక్కాడు.
హత్య కేసు నిందితుని అరెస్ట్
By
Published : Feb 14, 2019, 11:47 PM IST
హత్య కేసు నిందితుని అరెస్ట్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్లు గ్రామంలో నవంబర్ 5న హత్యకు గురైన విశ్రాంత ఉద్యోగి కేసును కల్వకుర్తి పోలీసులు చేధించారు. తన కూతురు శుభలేఖలు పంచేందుకు కల్వకుర్తి వచ్చాడు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. హైదరాబాదులోని కూకట్పల్లికి చెందిన నిందితుడు శ్రీ రామాచారిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి లక్షా 70 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.