నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. నల్లమలలో సమీపంలో అటవీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది. అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి సమీపంలోని తాటి చెలుక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కొందరు రైతులు పోడు భూమిని సాగుచేస్తున్నారు. అయితే గత సంవత్సరం... అక్కడ సాగుచేయకుండా పోలీసుల సాయంతో అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఇవాళ అటవీశాఖ సిబ్బంది మొక్కలు నాటేందుకు జేసీబీలు, ఇతర వాహనాలతో వెళ్లారు.
అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడు భూముల రైతులు.. ఉద్రిక్తత - తెలంగాణ తాజా వార్తలు
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బంది, వారి వాహనాలను.. పోడు భూముల రైతులు అడ్డుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన అటవీ, పోలీసు సిబ్బంది.. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం అందుకున్న పోడు భూముల రైతులు.. అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. అటవీ సిబ్బంది తీరుపై.. రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో.. ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల వాహనాల ముందు నిల్చొని.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకొని అమ్రాబాద్‌కు తరలించారు.
ఇవీచూడండి:Theenmar Mallanna: 'ఎన్ని కేసులు పెట్టినా... పోరాటం ఆగదు'