తెలంగాణ

telangana

ETV Bharat / state

'త్వరలోనే చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం' - sc st commission chairman srinivas visited nagar kurnool

చెంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్​ డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు.

telangana whip and sc st commission chairman srinivas visited nagar kurnool
'త్వరలోనే చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం'

By

Published : May 14, 2020, 11:29 AM IST

నాగర్​ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, లింగాల మండలాల్లోని అప్పాపూర్, మల్లాపూర్, చెంచుపేటలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. చెంచుల జీవన విధానం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

చెంచులు తమకు నీళ్ల వసతి, విద్యా, వైద్య, వాహన సౌకర్యాలు లేవని, ఆంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కోరారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

లాక్​డౌన్​లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న చెంచులకు ఆర్డీటీఐసీడీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details