తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ నిర్వహించి, ఎస్జీటీల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్​లో వినతి పత్రం అందజేశాయి.

teachers-protest-at-collectorate-in-nagarkurnool
కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన..

By

Published : Dec 16, 2020, 7:07 PM IST

సెకండరీ గ్రేడ్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో... జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2018లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఎస్​జీటీలకు వెంటనే అమలు చేయాలని గుర్తు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. అర్హత గల ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతి కల్పిస్తూ.. ఖాళీగా ఉన్న 30 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటుహక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా దీల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటా: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details