Teacher Breaches Biometric Attendance Nagarkurnool :నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం 'లొట్లోనితండా' ప్రాథమిక పాఠశాల అది. 2022-23 విద్యా సంవత్సరంలో అక్కడ 18 మందివిద్యార్థులు చదివేవాళ్లు.విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అక్కడ ఒకే ఉపాధ్యాయుడు సాయిరెడ్డి ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు కూడా ఆయనే. అయితే ఆయన ఎప్పుడు బడికి సక్రమంగా వచ్చేవారు కాదని ఫిర్యాదులున్నాయి. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్(Telangana Graduates Association) సభ్యులు ఆరా తీశారు.
Biometric Attendance System Fraud Nagarkurnool :బయోమెట్రిక్ హాజరు చూస్తే అతను బడికి వస్తున్నట్లుగా హాజరు నమోదవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే అతను ఎప్పుడు బడికి సక్రమంగా వచ్చింది లేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా అతని బయోమెట్రిక్ హాజరు వివరాలను కోరింది. ఆ దస్త్రాలను పరిశీలిస్తే, సమయానికి బయోమెట్రిక్ యంత్రం(Biometric Machine) ద్వారా హాజరు నమోదు చేస్తున్నాడు.. కానీ 75 శాతానికి పైగా ఆయన పాఠశాలలో కాకుండా బయటి ప్రాంతాల నుంచి హాజరు నమోదు చేసుకున్నట్లుగా తేలింది. బయోమెట్రిక్ హాజరు యంత్రాన్ని వెంటబెట్టుకొని వెళ్లి ఆ సమయానికి ఎక్కడుంటే అక్కడ వేలిముద్రతో హాజరు నమోదు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.
Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు
Cheat Biometric Attendance System : ఉపాధ్యాయుడు సక్రమంగా బడికి రాకపోవడంతో 'లొట్లోనితండా' ప్రాథమిక పాఠశాలలో 18గా ఉన్నవిద్యార్థుల సంఖ్య.. గతేడాది 9మందికి చేరింది. ఈ విద్యార్థులుకూడా వెళ్లిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సాయిరెడ్డిని ప్రస్తుతం మరోచోటకు మార్చారు. దీంతో పాఠశాలను మూసేశారు. ఏకోపాధ్యాయుని బయోమెట్రిక్ లీలలు బయటపడుతుండడంతో అతనినీ కాపాడేందుకు అధికారులు ఆ బడిని మూసేసి.. మరోచోట డిప్యూటేషన్‌పై విధులు కేటాయించారాని పలువురు ఆరోపిస్తున్నారు.