తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరుగెత్తే నీటికి నడక నేర్పిద్దాం' - jalashakthi

నీటిని వృధా చేయకూడదని... ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని, పరుగెత్తే నీటికి నడక నేర్పించే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి డాక్టర్ ఆరిజ్ అహ్మద్ పేర్కొన్నారు.

'పరుగెత్తే నీటికి నడక నేర్పిద్దాం'

By

Published : Aug 23, 2019, 3:17 PM IST

నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి ఆరిజ్ అహ్మద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. భూగర్భ జలాల స్థాయి తీవ్రంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జల శక్తి అభియాన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, నీటి పరిరక్షణ కట్టడాలను ప్రతి ఇంటిలో నిర్మించాలని ఆరిజ్ అహ్మద్ సూచించారు.

'పరుగెత్తే నీటికి నడక నేర్పిద్దాం'

ABOUT THE AUTHOR

...view details