నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల కోసం సమ్మర్ సమురాయ్ క్యాంపు ఫేస్ 2 నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
విద్యార్థినిలు ఉత్సాహం
పదిహేను రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో శిక్షకులతో విద్యార్థులకు నృత్యాలు నేర్పిస్తున్నారు. ఈ క్యాంప్ తమకెంతో సంతోషాన్నిచ్చిందని విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని గురుకుల పాఠశాలలు అన్ని రంగాల్లోనూ ముందున్నాయని గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ సావిత్రి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 300 మంది విద్యార్థినులకు పోషక విలువలతో కూడిన భోజన సౌకర్యంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమ్మర్ క్యాంపులో విద్యార్థినుల సందడి ఇదీ చదవండి: శ్రీవారి రథం లాగిన త్రివిక్రమ్ దంపతులు