నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 33/11 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్భూ మిపూజ చేశారు. రూ.1.65 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఒకటి రెండు గ్రామాలకు కలిపి ఒక ఉప కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతి గ్రామంలో తారురోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెల్లడించారు.
విద్యుత్ ఉపకేంద్రం పనులకు భూమిపూజ - Sub Station stars in Nagarkarnool district by MP Ramulu
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 33/11 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భూమిపూజ చేశారు.
![విద్యుత్ ఉపకేంద్రం పనులకు భూమిపూజ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4250847-790-4250847-1566832800144.jpg)
'అన్ని గ్రామాలకు విద్యుత్ ఫలాలు అందిస్తాం'