తెలంగాణ

telangana

ETV Bharat / state

నిధులు మంజూరు చేస్తాను : మంత్రి శ్రీనివాస్ గౌడ్ - tate sport s minister distributed prizes to winning teams

15 రోజులుగా ఎన్టీఆర్ మినిస్టేడియంలో.. జరుగుతున్న అచ్చంపేట ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిలకించారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.

state sport s minister distributed prizes to winning teams in achampet
నిధులు మంజూరు చేస్తాను : మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Dec 27, 2020, 10:35 PM IST

అచ్చంపేట ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు. అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినిస్టేడియంలో 15రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించేశారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

నిధులు మంజూరు చేస్తాను : మంత్రి శ్రీనివాస్ గౌడ్

నిధులు మంజూరుకు హామీ

త్వరలో జరిగే ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లోపు .. మైదానానికి కావలసిన నిధులు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అచ్చంపేట నల్లమల నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని క్రీడాకారులను ఉద్ధేశిస్తూ చెప్పారు.

ఇదీ చదవండి:పీవీ దేశాన్ని సమూలంగా మార్చిన తపస్వి: వెంకయ్య

ABOUT THE AUTHOR

...view details