కేసీఆర్ ప్రభుత్వం.. అహర్నిశలు రైతుల కోసం కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీమర్ల మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గోపాల్ నాయక్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వలబాలరాజు, ఎంపీ రాములుతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన కమిటీ రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి... రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా పని చేయాలని కోరారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి నిరంజన్‌రెడ్డి - నాగర్‌కర్నూల్ జిల్లా తాజా వార్త
రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి నిరంజన్‌రెడ్డి state agriculture minister niranjan reddy participated in agri market commity oth ceremony in nagarkurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8412148-25-8412148-1597367605796.jpg)
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతులకు గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వమే కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే పంటను కొనుగోలు చేసినట్లు మంత్రి సింగిరెడ్డి తెలిపారు. కరోనా సంక్షోభ కాలంలోనూ కేసీఆర్ సర్కారు రైతులకు చేయూతనందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయని పంటలు సమృద్ధిగా పండుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా