శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. మాక్‌డ్రిల్ - undefined
18:36 September 02
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. మాక్‌డ్రిల్
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మళ్లీ అగ్నిప్రమాదం కలకలం రేగింది. నిజమైన అగ్నిప్రమాదం అనుకుని భయంతో ఉద్యోగుల పరుగులు తీశారు. మరోసారి అగ్నిప్రమాదం జరిగితే ఎలా స్పందిస్తారోనని అధికారులు మాక్‌డ్రిల్ చేశారు.
మాక్‌డ్రిల్‌గా తేలడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మాక్‌డ్రిల్ చేశామని సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తత పరిశీలనకు రహస్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించామని అన్నారు. విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి వెళ్లానని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకే మాక్‌డ్రిల్ చేపట్టామని వివరించారు.
ఇదీ చూడండి :నర్సును మోసం చేసిన కేటుగాళ్లు.. లాడ్జికి పిలిపించి అసభ్య ప్రవర్తన