నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ కార్యాలయ అధికారులు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. పలు జాగ్రత్తలు సూచించారు. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లుకు ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తున్నందున జిల్లా రవాణా శాఖ కార్యాలయం వాహనదారులతో కిక్కిరిసి పోయింది. అప్రమత్తమైన అధికారులు తగు చర్యలు చేపట్టారు. వేలి ముద్ర, ఫొటో, సిగ్నేచర్ల కోసం వినియోగించే స్కానర్లను కరోనా ప్రభావం వల్ల నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి తెలిపారు.
రిజిస్ట్రేషన్ పక్రియలో సడలింపు: నాగర్ కర్నూల్ డీటీఓ - vehicle registration at dto nagarkurnool
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వ చేపట్టిన సూచనల మేరకు నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వినియోగదారులకు కొన్ని మినహాయింపులు కల్పించారు.
రిజిస్ట్రేషన్ పక్రియలో సడలింపు: నాగర్ కర్నూల్ డీటీఓ
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన వారికి శానిటైజర్‌తో చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి అనుమతించారు.
ఇదీ చూడండి:ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?