ప్రభుత్వ పనులు సొంత ఇంటి నిర్మాణం పేరుతో.. నాగర్ కర్నూల్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఎర్ర మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారు. జేసీబీ వాహనాలతో కొండలను తొలిచి దాదాపు 30 ట్రాక్టర్లతో ఊరగట్టు, నల్లగుట్ట, జనంపల్లి, బావాయి పల్లి గ్రామాలకు మట్టిని తరలిస్తున్నారు.
గుట్టలు కరిగించి.. కాసులు పోగేస్తున్నారు. - nagar kurnool latest updates
నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమంగా ఎర్ర మట్టిని అమ్ముకుంటున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కోడేర్ తహసీల్దార్ సయ్యద్ స్పందించారు. అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కొండలను తొలిచి.. గ్రామ పంచాయతీల పనులకు ఎర్రమట్టిని తీసుకుపోతే.. మరికొంత మంది ఇంటి నిర్మాణ పనులకు తీసుకెళ్తున్నారు. ఇదే అదునుగా ట్రాక్టర్ యజమానులు మట్టిని అక్రమంగా తరలిస్తూ కాసులు పోగేస్తున్నారు. దీంతో గుట్టలు కరిగిపోతున్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు తెలుపుతున్నారు.
ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ సయ్యద్ చౌకత్ను సంప్రదించగా.. గ్రామ పంచాయతీల వద్ద ధ్రువీకకరణ పత్రాలు తీసుకొస్తే అనుమతులు ఇస్తున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తప్పుకున్న ఎన్పీసీఐ.. సైబర్ బాధితులకు మరిన్ని కష్టాలు!