నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్ కాటేదాన్‌లో ఉండేవాడు. లాక్డౌన్ వల్ల సొంత గ్రామానికి వచ్చిన అతనికి డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల చికిత్స నిమిత్తం మళ్లీ భాగ్యనగరానికి వెళ్లాడు.
కరోనాతో 60 ఏళ్ల వృద్ధుడు మృతి - nagarkurnool resident died of corona
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ చనిపోయాడని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
కరోనాతో 60 ఏళ్ల వృద్ధుడు మృతి
అక్కడ కరోనా బారిన పడిన ఆ వృద్ధుణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అతనికి సంబంధించి ఏడుగురు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి వారిని క్వారంటైన్లో ఉంచామని వెల్లడించారు.
- ఇదీ చూడండి:నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన
TAGGED:
కరోనాతో మర్రిపల్లి వాసి మృతి