లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై - లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై
15వేలు లంచం తీసుకుంటూ నాగర్‌కర్నూల జిల్లా తెలకలపల్లి ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. పశువుల సంత దక్కించుకున్న వ్యక్తి నుంచి ఎస్సై నెలకు 8వేలు డిమాండ్ చేశాడు.
![లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4703918-thumbnail-3x2-si.jpg)
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై
నాగర్‌కర్నూలు జిల్లాలో 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తెలకలపల్లి ఎస్సై... ఏసీబీ అధికారుల చిక్కాడు. అదే గ్రామానికి చెందిన పరమేశ్ అనే వ్యక్తి వేలంపాటలో పశువుల సంతను దక్కించుకున్నాడు. నెలకు 8వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇవ్వలేనని పరమేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం రెండు నెలలకు 15వేలు ఇచ్చేందుకు ఎస్సై ఇంటికి వచ్చాడు. నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై