తెలంగాణ

telangana

ETV Bharat / state

15మంది ఎంపీడీవోలు,15 ఎంపీవోలకు షోకాజ్‌ నోటీసులు - nagarkurnool collector news

నాగర్ కర్నూల్ జిల్లా గ్రామాల్లో పల్లెప్రగతి పనులలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తోన్న సర్పంచులు, అధికారులకు కలెక్టర్ ఎల్ శర్మన్ చౌహాన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

15మంది ఎంపీడీవోలు,15 ఎంపీవోలకు షోకాజ్‌ నోటీసులు
15మంది ఎంపీడీవోలు,15 ఎంపీవోలకు షోకాజ్‌ నోటీసులు

By

Published : Aug 7, 2020, 9:36 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా గ్రామాల్లో పల్లెప్రగతి పనులలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తోన్న 158 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, 15 మంది ఎంపీడీఓలకు, ఎంపీఓలకు కలెక్టర్ ఎల్ శర్మన్ చౌహాన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా 20 మండలాల గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ విస్తృతంగా పర్యవేక్షించారు.

మండల ప్రత్యేక అధికారుల సందర్శన నివేదికల ఆధారంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో శ్మశాన వాటికలు డంపింగ్ యార్డుల చెత్తతో ఎరువు తయారీ కేంద్రాల నిర్మాణాల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్న 158 గ్రామ పంచాయతీల సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 15 మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పల్లె ప్రగతి పనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడిన కారణంగా నోటీసులు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని పాలనాధికారి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details