నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా పంట నష్టం జరగడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు కుడికిల్ల గ్రామంలో అర్ధరాత్రి రేకుల ఇల్లు కూలి దేవమ్మ అనే వృద్దురాలు మృతి చెందింది. నియోజకవర్గంలో చాలా ఇళ్లు కూలిపోవడం, మరికొన్ని శిథిలావస్థలో ఉండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- ముక్కిడిగుండం- నార్లాపూర్ వాగులు పొంగిపొర్లుతున్నా పాలకులు పాలకులు పట్టించుకోవడంలేదని ఆదోళనకు దిగిన గ్రామస్థులు.. దిష్టిబొమ్మలను దహనం చేశారు.
- వీపనగండ్ల మండలంలో తూంకుంట వాగు , పుల్గర్ చర్ల గ్రామ సమీపంలో బీమా కాలువ కేఎల్ఐ కాలువలు తెగిపోవడం వల్ల దాదాపు 50 ఎకరాల వరి, వేరుశనగ పంట నీట మునిగడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- కోడేర్ మండలంలో రాజాపూర్‌లో రెండు ఇల్లు, ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో ఉన్న రెండు ట్రాక్టర్లు వరదల కొట్టుకుపోయాయి. చెరువు పక్కన ఉన్న పంట పొలాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
- చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాలలో దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన నివాసగృహాలు శిథిలావస్థకు చేరాయి. పాతవి కూలే ప్రమాదం ఉండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు..
- పానగల్ మండలంలోని చెరువులు , భీమాకాల్వ వెంట ఉన్న పంట పొలాలు కెఎల్ఐ కాలువు అంచున ఉన్న వరి పంటలు నీట మునిగాయి. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు.
- కొల్లాపూర్ మండలంలోని వరిదేలా ఊర చెరువు, మల్లపు రాజుకుంట, చుక్కాయిపల్లి చెరువుల దిగువన వేసిన పంటలు నీటి ప్రవాహంతో కోతకు గురయ్యాయి.
- పెంట్లవెల్లి మండలంలోని చౌటచెరువు కింద వేసిన వరి పంటలు అలుగు పారడం వల్ల పూర్తిగా నీట మునిగింది.