నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మండల పరిధిలోని 11 ఎంపీటీసీ, ఒక జడ్పీపీటీసీ స్థానం కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడం వల్ల అధికార పార్టీతో సహా కాంగ్రెస్, భాజపా, జనసేన, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకు ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు.
కల్వకుర్తి పరిధిలో ప్రచారం ముమ్మరం - local body elections
కల్వకుర్తిలో రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
స్థానిక ఎన్నికల ప్రచారం
ఇవీ చూడండి: పోలీసు కస్టడీకి హాజీపూర్ నిందితుడు