SBI Bank Employee Fraud in Nagarkurnool : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారుడి సొమ్మును.. సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. మరో బాధితురాలికి నకిలీ ఎఫ్‌డీ పత్రం(Duplicate FD document) ఇచ్చి మోసగించాడు. బాధితులు అందోళనకు దిగడంతో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌కు అచ్చంపేట పట్టణంలోని స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. అందులో రూ.14.73 లక్షలు ఉన్నాయి. గత నెల 29న ఆ వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి రూ.లక్ష తీసుకునేందుకు దరఖాస్తును సమర్పించాడు. దాన్ని పరిశీలించిన క్యాషియర్ ఖాతాలో లక్ష రూపాయలు లేవని చెప్పాడు. ఈ విషయం విన్న ఖాతాదారుడు షాక్ గురయ్యాడు. ఈ విషయమై 30న రాతపూర్వకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు.
State Bank Employee Cheat Customer : అసలు నిజం తెలుసుకునేందుకు మేనేజర్ ఖాతాను పరిశీలించాడు. అకౌంట్లో సెప్టెంబర్ 5న ఒకసారి రూ.6 లక్షలు, మరో విడత రూ.5 లక్షలు.. 6వ తేదీన రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.14 లక్షలు ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి ఖాతా(Bank Employee)కు బదిలీ అయ్యాయని అంతర్గత విచారణలో గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సొమ్ము ఖాతాలో జమయ్యేలా చూస్తామనిహామీ ఇచ్చిన బ్యాంకు అధికారులు.. తర్వాత స్పందించడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచి భర్త కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో ఉన్నాడని.. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఎస్‌బీఐ బ్రాంచిలో కోట్ల నగదు సహా ఆభరణాలు మాయం.. తీరాచూస్తే..!
14 Lakh Fraud Bank Employee in Nagarkurnool : బ్యాంకులో ఖాతాదారుడు చేస్తున్న ఆందోళనను అక్కడ ఉన్న సిబ్బంది.. సెలవులో ఉన్న బ్రాంచి మేనేజర్ హుసేన్ బాషాకి తెలియజేశారు. ఆయన వెంటనే ఫోన్లో బాధితులతో మాట్లాడి.. ధైర్యం చెప్పారు. ఓ ఉద్యోగి పొరపాటు చేసిన విషయం వాస్తవమేనని, విచారణ కొనసాగుతోందని, న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.