ప్రజలకు సేవచేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులకు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడు అనే అహంభావంతో కాకుండా సేవకుడిలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సర్పంచులు పాల్గొన్నారు.
అహం వద్దు సేవే ముద్దు - sarpanch
నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సర్పంచులకు మార్గనిర్దేశం చేశారు.

మర్రి జనార్దన్ రెడ్డి