కొల్లాపూర్‌లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - కొల్లాపూర్
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369వ జయంతిని గౌడ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు.
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369 జయంతిని గౌడ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. పేద కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాధినేతగా పేరొందిన గొప్ప రాజు పాపన్న అని పలువురు కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి పోరాటం చేసిన అసామాన్య వీరుడని గుర్తుచేసుకున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటం ముందు జ్యోతిప్రజ్వలన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ సుధారాణి.. గౌడ సంఘం నూతన భవనానికి భూమి పూజ చేశారు. కులమతాలకతీతంగా పోరాడిన వీరుడు పాపన్నగౌడ్ అని గౌడసంఘం నాయకులు అన్నారు.
- ఇదీ చూడండి :నాంపల్లిలో నమో భారత్ - నవతెలంగాణ సభ