నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత వారం రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొంతున్నాడు.
కరోనా మృతుని అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ - దారారంలో కరోనా మృతుని అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్
కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి ఓ సర్పంచ్ తన మానవత్వం చాటుకున్నారు. బంధువులెవరూ ముందుకు రానివేళ కుటుంబసభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరోనా మృతుని అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్
సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ కవితా శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది, మృతుని కుటుంబసభ్యులతో కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ దహన సంస్కారాలు నిర్వహించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి: కరోనా పరిస్థితిపై హైకోర్టులో నేడు అత్యవసర విచారణ