రాష్ట్ర వ్యాప్తంగా దసరా కల్లా రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన రైతు వేదికల నిర్మాణ పనుల్ని పరిశీలించారు. కొన్ని జిల్లాల్లో వారం రోజుల్లో అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు.
'దసరా వరకు రైతు వేదికలు పూర్తి చేయాలి' - Farmer platforms must be completed by Dussehra
నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. దసరా వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'దసరా వరకు రైతు వేదికలు పూర్తి చేయాలి'
ప్రధానంగా వెనుకబడిన జిల్లాలపైనే దృష్టి సారించామన్నారు. జరగాల్సిన పనిని దృష్టిలో ఉంచుకుని పనులను విభజించుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, ప్రత్యేకాధికారులను మోహరించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెల్దండ మండలంలోని పెద్దాపూర్, వెల్దండ, కొట్ర రైతు వేదికలను పరిశీలించారు. వెల్దండలో రైతువేదిక నిర్మాణం విషయంలో అలసత్వం వహించిన వెల్దండ ఎంపీడీఓను సస్పెండ్ చేయాల్సిందిగా నాగర్ కర్నూల్ ఇంఛార్జ్ కలెక్టర్ యాస్మిన్ బాషాను ఆదేశించారు.