నాగర్కర్నూల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. షాద్నగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం పాలెం. ఆర్టీసీ సమ్మె ఉండడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇల్లు గడవక భార్య పిల్లలతో కూలీ పనికి వెళ్తున్నాడు. బాధలు చూడలేక ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని ప్రజలందరూ మీ వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు.
పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు - నాగర్కర్నూల్లో ఆర్టీసీ కార్మికుడి ఆత్యహత్యాయత్నం
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు