తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో ఆర్​ఎస్​ ప్రవీణ్​ ఆకస్మిక తనిఖీ - రాష్ట్ర గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్ర గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల లోని వివిధ తరగతులను పరిశీలించి విద్యార్థుల మేధస్సును పరీక్షించారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు.

rs praveen kumar inspection social welfare school
గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

By

Published : Mar 15, 2020, 5:37 PM IST

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రాకను గమనించిన విద్యార్థులు, అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులను ధ్రువపత్రాలు పరిశీలించి అధ్యాపకులతో మాట్లాడారు. పాఠశాలలోని వివిధ తరగతులను పరిశీలించి విద్యార్థుల మేధస్సును పరీక్షించారు.

ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు. తరగతి గదిలో ఏర్పాటు చేసిన అద్దం ముందు నిలబడి ప్రతి విద్యార్థి తనని తాను చూసుకుంటూ చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

ఇవీచూడండి:సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలపై స్పీకర్​కు ఫిర్యాదు: భట్టి

ABOUT THE AUTHOR

...view details