తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు కచ్చితంగా పాటించాలి' - 'నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు కచ్చితంగా పాటించాలని నాగర్​ కర్నూల్​ డీటీవో ఎర్ర స్వామి అన్నారు. కొల్లాపూర్​లో 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్నారు.

road sefty awareness program in nagar karnul district
'నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

By

Published : Feb 1, 2020, 1:39 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీటీవో ఎర్ర స్వామి హాజరయ్యారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగినా ఎలాంటి గాయాలు కావన్నారు.

18 ఏళ్లు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాన్ని నడపాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పిన్న వయస్సులో వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ మోహన్​ రెడ్డి కోరారు. నిబంధనలకు అనుగుణంగా వాహనం నడిపితే ఎలాంటి చర్యలు ఉండవన్నారు.

'నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి

ABOUT THE AUTHOR

...view details