రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కింది ఓ అవినీతి తిమింగలం. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న జయలక్ష్మి కలెక్టరేట్లో సి-బ్లాక్‌లో ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది.
తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో వివాదంలో ఉన్న రెండు ఎకరాల 25 గుంటల భూమి పట్టా మార్పిడి కోసం ఓ రైతు నుంచి రూ. 13 లక్షలు డిమాండ్ చేసింది సదరు అవినీతి అధికారిణి. అంత సొమ్మును ఇచ్చుకోలేనన్న రైతు మాటలతో రూ. 10 లక్షలకు వాయిదాల పద్ధతిన లక్ష చొప్పున ఇచ్చేటట్లు బేరం కుదిరింది.
సోమవారం కలెక్టరేట్లోని సీ-బ్లాక్‌లో రూ. లక్ష రైతు వెంకటయ్య నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. కొసమెరుపు ఏంటంటే ఈమె పనిచేస్తున్న సీ- బ్లాక్ భూములకు ఈమె పరిధికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ తాను అన్ని పనులు చేస్తానని వెంకటయ్యను నమ్మించి అడ్డంగా దొరికిపోయింది.
ఉప తహసీల్దార్‌పై కేసు నమోదు చేసి ఆమె ఇంట్లో కూడా సోదాలు చేస్తామని.. అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
పట్టా మార్పిడి కావాలా.. కొట్టు రూ. 10 లక్షలు ఇవీ చూడండి:'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'