సజీవ దహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి. జిల్లా కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు, వివిధ శాఖల నాయకులు నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ఈరోజు ఈ సమస్య ఏర్పడిందని రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు. సర్కారు తీసుకొవచ్చిన కొత్త విధానాల వల్లే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
'ధరణి ప్రాజెక్టులోని లోపల వల్లే..' - నాగర్‌కర్నూల్‌లో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని నాగర్‌కర్నూల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు.
!['ధరణి ప్రాజెక్టులోని లోపల వల్లే..'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4994337-thumbnail-3x2-df.jpg)
రెవెన్యూ ఉద్యోుగుల ఆందోళన