రైతులు పొలాల్లో ఉండాలి లేకుంటే ఇంట్లో ఉండాలి అంతేగాని ప్రభుత్వ కార్యాలయాల చుట్టు నిత్యం ప్రదక్షిణలు చేసే పరిస్థితి మారాలని నాగర్‌కర్నూల్ శాసన సభ్యుడు మర్రి జనార్దన్‌రెడ్డి ఆకాంక్షించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. తాడురు మండలంలో సంయక్త కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి కర్షకుల సమస్యల పరిష్కారనికై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల సమస్యలు, పాసు పుస్తకాల జారీలో ఇబ్బందులను అధిగమించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషిచేస్తారని సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.