Revanth Reddy Speech at Kollapur Public Meeting : ఇందిరాగాంధీ పేదల పాలిట దేవత అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళ అని ఆయన కొనియాడారు. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం తపించిన వీర వనిత వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రతినిధిగా దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ నాయకత్వం వహించారన్నారు. కొల్లాపూర్ సభకు ప్రియాంకగాంధీ రావాల్సి ఉందని.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) హుటాహుటిన ఇక్కడకు వచ్చారని తెలిపారు. కొల్లాపూర్ సభ కోసం హెలికాప్టర్లో వెళ్లడం ప్రమాదమని చెప్పినా.. రిస్క్ చేసి ఇక్కడకు వచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు.
Revanth Reddy Kollapur Public Meeting Speech :తెలంగాణ రాష్టం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు దోపిడీ చేశారని ఫైర్ అయ్యారు. మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కోరుతున్నారని.. ఆయనను మళ్లీ సీఎం చేస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారని ఎద్దేవా చేశారు. పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చాల్సి ఉందని రేవంత్ పేర్కొన్నారు. పాలమూరు, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు పూర్తికాలేదని.. జిల్లాలో వలసలు ఆగలేదని.. ఆత్మహత్యలు నివారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy on Telangana Congress Manifesto : పాలమూరు జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు(Rythu Bandhu) నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని.. కాంగ్రెస్ వస్తే రైతుభరోసా కింద రూ.15 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. వ్యవసాయభూమి ఉన్న వారికి ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా విద్యుత్ అందిస్తాని హామీ ఇచ్చారు.