నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్ననూరు సమీపంలోని ప్రతాపరుద్రుడి కోటను పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. 14 వందల ఏళ్ల నాటి ఈ కోట కాలక్రమేనా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కోటను పునరుద్ధరిస్తూ పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ముమ్మరం చేశారు. నల్లమలలోని ప్రతాపరుద్రుని కోటను కూడా తెలంగాణ రాష్ట్ర టూరిజం ఆధ్వర్యంలో అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ చౌహాన్ పేర్కొన్నారు.
ప్రతాపరుద్రుని కోట పునరుద్ధరణ పనులు షురూ... - telangana news
చరిత్రకు ఆలవాలమై, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ప్రతాపరుద్రుని కోటకు పునరుద్ధరన పనులను మొదలుపెట్టారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోట శిథిలావస్థకు చేరగా.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ముమ్మరం చేశారు.
వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ కోటను కాకతీయులు నిర్మించారు. శత్రు రాజ్యాల నుంచి రాజ్యాన్ని కాపాడేందుకు ఎవరికీ అందనంత ఎత్తులో కోట నిర్మించి, అక్కడి నుంచే పరిపాలించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. దక్షిణం నుంచి తూర్పువైపు ప్రవహిస్తున్న కృష్ణా నది తీరాన ఈ కోటను నిర్మించారు. సుమారు 100 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కోట చాలాచోట్ల శిథిలావస్థకు చేరుకుంది. సముద్రమట్టానికి 450 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉన్న కోటపైకి ఎక్కేందుకు రహదారులు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కోటపై నుంచి తిలకిస్తే ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
ఇదీ చూడండి: మద్యం మానేద్దాం.. 2021ని హాయిగా గడిపేద్దాం!