తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళ కడుపులో 12కిలోల కణితి

పాచిపని చేసుకుంటూ జీవించే మహిళ అనారోగ్యం పాలైంది. ఆస్పత్రికి వెళ్తే కడుపులో 12కిలోల కణితి గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి ఆమెను కాపాడారు.

By

Published : May 19, 2019, 1:24 PM IST

మహిళ కడుపులో 12కిలోల కణితి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సీబీఎమ్ ప్రజా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స ఓ మహిళ ప్రాణాన్ని నిలబెట్టారు వైద్యులు. చారగొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన వెలజల్ యాదమ్మ హైదరాబాద్​లో ఉంటూ ఇళ్లలో వంట పని చేసుకొని బతుకుతోంది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోలేదు. గత కొన్నాళ్లుగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సీబీఎం ప్రజా వైద్యశాల వెళ్లింది. ఆమెకు థైరాయిడ్ సమస్య ఉందని, కడుపులో 12 కిలోల కణితి గుర్తించారు. ఈ రోజు ఉదయం గంటన్నరపాటు శ్రమించి కణితిని తొలగించారు. విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసిన వైద్య బృందాన్ని పలువురు అభినందించారు.

మహిళ కడుపులో 12కిలోల కణితి

ABOUT THE AUTHOR

...view details