తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా రంజాన్​ పండుగ వేడుకలు - నిరాడంబరంగా రంజాన్​ పండుగ వేడుకలు

రంజాన్​ పండుగపై లాక్​డౌన్​ ప్రభావం తీవ్రంగా పడింది. నాగర్​కర్నూల్​ జిల్లాలో ముస్లింలు నిరాడంబరంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు.

ramzan celebrations in nagarkarnool district
నిరాడంబరంగా రంజాన్​ పండుగ వేడుకలు

By

Published : May 25, 2020, 1:36 PM IST

నాగర్​కర్నూల్ జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. కరోనా వల్ల ఈ ఏడాది రంజాన్ పండుగను ముస్లింలు ఎలాంటి హడావుడి లేకుండా చేసుకున్నారు. నాగర్​కర్నూల్, బిజినపల్లి, తెలకపల్లి, తిమ్మాజీపేట, తాడూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రార్థన మసీదులు నిర్మానుష్యంగా మారాయి.

ప్రధానంగా మసీదులు, ఈద్గాల వద్ద మైనార్టీ సోదరులు ఎలాంటి ప్రార్థనలు చేయలేదు. జిల్లాలోని అన్ని మసీదులు ఈద్గాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వారివారి ఇళ్ల వద్దనే కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లాను ప్రార్థించారు. ఒకరినొకరు కలుసుకోకుండా భౌతికదూరం పాటించారు. నాయకులు మాత్రం వాట్సాప్​లోనే శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పూట ఎలాంటి హడావిడి లేకపోవటం వల్ల గ్రామాలు, పట్టణాల్లో సందడి కనిపించలేదు.

ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details