నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్, లింగాల మండలాల్లోని వరి కొనుగోలు కేంద్రాల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది. గత 20 రోజుల నుంచి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు. సాయంత్రం గాలితో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యంపై కప్పడానికి కవర్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలయింది. అమ్ముకుందామని తీసుకొచ్చిన వడ్లు వర్షానికి తడిసి ముద్దవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్, లింగాల మండలాల్లోని కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది.
![అకాల వర్షం.. తడిసిన ధాన్యం అకాల వర్షం.. తడిసిన ధాన్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:19:53:1622044193-11909832-mbnr.jpg)
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
లింగాల మండల సింగిల్ విండో పాలకులు తమకు అనుకూలమైన వారిని ముందుగా కొనుగోలు చేస్తున్నారని మిగతా వారిని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 కోట్లతో లింగాల మండల కేంద్రంలో నిర్మించిన గోదాంలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:KTR: సమ్మెకు ఇది సరైన సమయం కాదు