ఆత్మహత్య చేసుకున్న గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతదేహంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చేంత వరకు కదిలేదిలేదని బైఠాయించారు. కలెక్టర్ రావాలంటూ డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి కార్యదర్శులు భారీ సంఖ్యలో రావడం వల్ల నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత - కలెక్టరేట్ ముందు కార్యదర్శులు ఆందోళన
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతి చెందింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో కలెక్టరేట్ ముందు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు.
నాగర్ కర్నూలు కలెక్టరేట్లో ఉద్రిక్తత
TAGGED:
పురుగుల మందు తాగి ఆత్మహత్య