వైద్య సిబ్బంది.. కొద్ది మందికి మాత్రమే టెస్టులు నిర్వహించి కిట్స్ అయిపోయాయంటూ పరీక్షలు నిలిపివేస్తున్నారని ఆరోపిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కొవిడ్ కేంద్రం ఎదుట ప్రజలు ఆందోళన చేపట్టారు. పరీక్షల కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుంచి క్యూలో నిలబడి వేచి ఉన్నారు. పరీక్షలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడంతో బాధితులు ఆగ్రహానికి గురయ్యారు. కేంద్రంలోని కుర్చీలను ధ్వంసం చేసి.. టెంట్‌ను కూల్చి వేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
కొవిడ్ కేంద్రం ఎదుట అనుమానితుల ఆందోళన - టెస్టులు నిలిపివేశారంటూ ఆగ్రహం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొవిడ్ కేంద్రం ఎదుట ప్రజలు ధర్నా చేపట్టారు. టెస్టులు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని కుర్చీలను ధ్వంసం చేసి.. టెంట్‌ను కూల్చి వేశారు.
protest at covid center
పరీక్షల కోసం ఉదయం నుంచి వేచి ఉంచారంటూ ప్రజలు వాపోయారు. తమకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి:రోజూ లక్ష పరీక్షలు చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోరా..?