తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు అరికట్టాలి' - అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

నాగర్‌ కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులను అరికట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ నాయక్‌ డిమాండ్‌ చేశారు. అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

'రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు అరికట్టాలి'
'రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు అరికట్టాలి'

By

Published : Jul 7, 2020, 9:34 AM IST

నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ నాయక్ డిమాండ్‌ చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాధవని పల్లి రైతులపై దాడులను ఆపాలని అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి గిరిజన సంఘం నాయకులు ధర్నా చేపట్టారు.

రైతులు సాగు చేసుకుంటున్న భూముల పట్టాలను అందజేయాలని ధర్మ నాయక్‌ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా అధికారులు అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. వందల ఏళ్లుగా అమ్రాబాద్‌, పదరా మండాల్లో సాగు చేసుకుంటున్న రైతులను అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులపై అధికారుల ఆగడాలను ఆపకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details