రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'ప్రొఫెసర్ జయశంకర్... జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు' - Professor jayashankar jayanthi celebrations
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
'ప్రొఫెసర్ జయశంకర్... జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు'
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, సార్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో అందరూ పునరంకితం కావాలని జనార్దన్ రెడ్డి అకాంక్షించారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం భావి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Last Updated : Aug 6, 2020, 6:24 PM IST