నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ ఐదు నెలల గర్భవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వనపర్తికి చెందిన లావణ్యతో గతేడాది జూన్‌లో వట్టెం గ్రామానికి చెందిన వెంకటేష్‌కు వివాహం జరిపించారు. అప్పటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని ఆరోపిస్తూ... కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది.
బంధువుల సమక్షంలో రాజీకుదిర్చి పంపగా.. వేధింపులు మాత్రం తగ్గలేదని మృతురాలి సోదరుడు ఆరోపించారు. లావణ్య గర్భవతి అయిందని, ఇక వారి మధ్య గొడవలు తగ్గుతాయని లావణ్య కుటుంబ సభ్యులు ఆశించగా... ఎవరూ లేని సమయంలో లావణ్య ఉరి వేసుకుని చనిపోయిందని వెంకటేష్ ఫోన్ చేసి తెలిపాడు.