ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేపు రెండు పురపాలక స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
కొవిడ్ నిబంధనల నడుమ పోలింగ్‌కు ఏర్పాట్లు - Polling for municipal elections
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట పురపాలక ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధమవుతోంది. జడ్చర్ల బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అచ్చంపేటలోని జేఎంజే హైస్కూల్లో ఎన్నికల సామాగ్రి సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లపై మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి.
కొవిడ్ నిబంధనల నడుమ పోలింగ్‌కు ఏర్పాట్లు