తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రవాహంలో చిక్కుకున్న శునకాన్ని కాపాడిన పోలీసులు - పోలీసుల వార్తలు

నాగర్‌ కర్నూల్‌లో కేసరి సముద్రం చెరువులోని ఎండబెట్ల రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహానికి ఓ శునకం చిక్కుకొని బిక్కుబిక్కు మంటుంది. ఇది గమనించిన పోలీసులు కుక్కను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు.

ప్రవాహంలో చిక్కుకున్న శునకాన్ని కాపాడిన పోలీసులు
ప్రవాహంలో చిక్కుకున్న శునకాన్ని కాపాడిన పోలీసులుప్రవాహంలో చిక్కుకున్న శునకాన్ని కాపాడిన పోలీసులు

By

Published : Sep 16, 2020, 10:48 PM IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో చెరువులు కుంటలు అలుగు పారుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో రెండు వైపుల నుంచి చెరువు నుంచి అలుగు పారుతుంది. చెరువులోని ఎండబెట్ల రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది.

ఈ ప్రవాహానికి ఓ శునకం చిక్కుకొని బిక్కుబిక్కు మంటుంది. ఇది గమనించిన పోలీసులు కుక్కను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. జేసీబీ సహాయంతో అరగంట పాటు కష్టపడి హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ దాన్ని రక్షించారు. దీంతో స్థానికులు శునకాన్ని కాపాడిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:అలాంటి వారి కోసమే గురువుగా మారిన ఎస్సై

ABOUT THE AUTHOR

...view details