తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 12మంది అరెస్టు

పేకాట స్థావరంపై దాడి చేసి 12 మందిని అరెస్టు చేసి అదుపుకి తీసుకున్న ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది. పేకాట స్థావరం నుంచి రూ. 1లక్ష రూపాయలు, 14 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Police Attacks On Poker base in nagar karnool district
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 12మంది అరెస్టు

By

Published : Jul 31, 2020, 8:36 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి​ మండలం యాపట్ల గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. స్థావరం నుంచి రూ. 1 లక్ష రూపాయల నగదు, 14 చరవాణులు, 4 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మద్యం తాగే వారికి, అసాంఘీక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details