నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డగించి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెల్దండ మండల కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలను కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు నేతృత్వంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై అడ్డగించారు.
'రీడిజైన్ల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం' - kalvakurthi lift irrigation
కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలను కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు నేతృత్వంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై అడ్డగించారు.
'రీడిజైన్ల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం'
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను, నేతలను ప్రజా సమస్యలపై స్పందించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నవారిని పోలీసులతో అడ్డగించటం తగదన్నారు. ప్రాజెక్టులు, ఇతర భవనాలను రీడిజైన్ల పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీటిని అందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.