తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భాజపా నాయకుల ధర్నా.. అరెస్ట్​ - కొల్లాపూర్​లో భాజపా ఆందోళన

తెరాస ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో కాసేపు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. వెంటనే వారిని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు.

BJP leaders' dharna
కొల్లాపూర్​లో భాజపా నాయకుల ధర్నా..

By

Published : Apr 2, 2021, 3:34 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో భాజపా నాయకులపై దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. పట్టణంలోని చౌరస్తాలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కోడేరు ఎస్సై ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పెద్దకొత్తపల్లి మండలంలోని పెద్దకారుపాములలో ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనగా.. భాజపా కార్యకర్తలు సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఉండగానే తెరాస నాయకులు దాడి చేశారు.

ఈ దాడిని నిరసిస్తూ కొల్లాపూర్​లో భాజపా నాయకులు ఆందోళన చేశారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కోడేరు ఎస్సైని సస్పెండ్​ చేయాలని వారు డిమాండు చేశారు. రోడ్లపై అనుమతులు లేకుండా ఆందోళనలు చేస్తే అరెస్ట్ చేస్తామని కొల్లాపూర్ ఎస్సై మురళి గౌడ్ వారిని అడ్డుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఉద్రికత నడుమ వారిని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు.

ఇదీ చూడండి:సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details