నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ మైనర్ బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికల ఇంటి సమీపంలోనే ఉండే ఆ బాలుడు వారిని తన ఇంట్లోకి పిలిపించుకుని ఆ చిన్నారులపట్ల అసహజంగా ప్రవర్తించాడని.. తన చరవాణిలోని అసభ్యకరమైన వీడియోలను చూపించి అదే విధంగా చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేశాడని చిన్నారులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలునిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గిరిబాబు వివరించారు.
'మైనర్ బాలునిపై పోక్సో కేసు నమోదు' - నాగర్ కర్నూల్ తాజా వార్త
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు తెలిపారు.
'మైనర్ బాలునిపై పోక్సో కేసు నమోదు'