నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పోచమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. ప్రజలు నమ్మకంతో దేవతలకు బోనాలతో మొక్కులు చెల్లించారు. వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలని కోరారు. కోళ్లు, పొట్టేళ్లు పోచమ్మ దేవతలకు సమర్పించారు.
కొల్లాపూర్లో వైభవంగా పోచమ్మ బోనాలు
ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతున్న పోచమ్మ బోనాలు కొల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలు పోచమ్మ, ఈదమ్మ, మైసమ్మ దేవతలకు ప్రజలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
కొల్లాపూర్లో వైభవంగా పోచమ్మ బోనాలు
చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా తరలివచ్చారు. మహిళలు పూనకంతో బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ, పోతురాజు వేషధారణతో భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు.
ఇవీ చూడండి:దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ