నాటిన ప్రతి మొక్కను సంరక్షించి.. పచ్చదనాన్ని పెంపొందించేందుకు క్లాస్మేట్ క్లబ్ కృషి చేస్తోందని క్లబ్ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వనవాసి సేవా ప్రకల్ప ఆవాస విద్య నిలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు 100 ట్రీ గార్డులను క్లబ్ తరఫున అందజేశారు.
క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం - నాగర్కర్నూల్ జిల్లా తాజా వార్తలు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్లబ్ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు క్లాట్మేట్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ డివిజన్ అధ్యక్షుడు బాదం పరమేశ్వర్ ప్రసాద్, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: గోదావరి బోర్డును ఏపీ తప్పుదోవపట్టిస్తోంది: తెలంగాణ లేఖ