నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లోని జీడిపల్లి గ్రామ సమీపంలో మరమ్మతు కోసం నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మరణించాడు. శుక్రవారం రాత్రి ఇదే గ్రామానికి చెందిన పాషా, శ్రీకాంత్ అనే యువకులు ద్విచక్రవాహనంపై కల్వకుర్తి వైపు వెళుతూ ట్రాలీని వేగంగా ఢీకొట్టాడు.
ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడి దుర్మరణం - నాగర్ కర్నూలు జిల్లా జీడిపల్లి తాజా వార్తలు
నాగర్ కర్నూలు జిల్లా జీడిపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడి దుర్మరణం
దీంతో పాషా(20) అక్కడికక్కడే చనిపోగా.. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.